కడప ( జనస్వరం ) : 18వ డివిజన్ అగ్రికల్చర్ లేబర్ కాలనీ నందు మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ మరియు 18 వ డివిజన్ ఏ, ఎల్, కాలనీ టిడిపి నాయకులు బుక్కే తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో భారీ అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ దుర్గా సంస్థల అధినేత ఎస్ దుర్గాప్రసాద్, మరియు రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్ అతికారి దినేష్ సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీగా జరిగిన ఈ అన్న సమర్పణ కార్యక్రమంలో కాలనీలోని ప్రజానీకం మొత్తం పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు రమేష్, జనసేన పార్టీ నాయకులు అబ్బన్న గారి రాజగోపాల్, వీరబ్రహ్మం నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, కొట్టే శ్రీహరి, గుగ్గిళ్ళ నాగార్జున, గోపికృష్ణ, వంశీకృష్ణ, సుధాకర్, మల్లికార్జున, సంజీవ్ నాయక్, గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com