Logo
Date of Publish : 09 January 2023, 3:40 pm
Editor : Sake Naresh

జగన్ పాలనలో వ్యాపారస్తులు బోణి కూడా కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు

- వైసిపి పాలన ఎప్పుడు పోతుందాఅని దేవుడికి దండం పెడుతున్నారు.

- పవన్ చంద్రబాబు కలయిక తో మార్పు మొదలైంది.

- పవన్ చంద్రబాబులను ఒక దగ్గర చూసి ప్రజలు సంతోషిస్తున్నారు.

       విజయవాడ, (జనస్వరం) : పశ్చిమ నియోజకవర్గంలో యువశక్తి ప్రచార కార్యక్రమం మూడవ రోజున 37 వ డివిజన్ అధ్యక్షులు శిగినంశెట్టి రాము గుప్తా ఆధ్వర్యంలో రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద నుంచి బయలుదేరి మెయిన్ బజార్ మోడరన్ కేఫ్ విజయ బ్యాకరి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ పాల్గొని ప్రతి షాప్ కు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులు మహేష్ తో జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా లేదని, కొన్ని రోజులు అసలు బోణి కూడా కావడం లేదని, పండగ వస్తే ఆనందం పోయి బాధ కలుగుతుందని, జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నామని, జగన్ పాలనలో ఇక్కడ వ్యాపారం చేయడం కన్నా ఒరిస్సా వెళ్లి మరమరాలు అమ్ముకుంటే బాగుంటుందనిపిస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికతో వైయస్సార్సీపీ నాయకుల్లో ఓటమి భయం మొదలైందని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, తప్పక అతి తొందరలోనే వారి భయం నిజమై అధికారం కోల్పోతారని, జగన్ పాదంలో వ్యాపారస్తులు నిత్యం బోణి కూడా కాకుండా నిరాశ నిస్పృహలతో మంచి రోజులు కోసం ఎదురు చూస్తున్నారని, మేము వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం చేస్తామని వారికి ఏ సందర్భంలో అయినా అండగా నిలబడతామని, విరాళాల కోసం వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాపారస్తుల్ని అనేక సందర్భాల్లో వేధించారని సమయం కోసం వ్యాపారస్తులందరూ ఎదురు చూస్తున్నారని తప్పక సరైన సందర్భంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో తవ్వా మారుతి, కొండేటి దేవానంద్, చల్ల ఏసు బాబు, కిలని రాము యాదవ్, దుర్గ రావు, బేతాళం రవికుమార్, మదన స్టాలిన్ శంకర్, కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com