
ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 25వ రోజు ఒంగోలులోని మామిడిపాలెం చెరువు మీద పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా వివిధ వర్గాల ప్రజలు జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, గద్దినెక్కిన నాటి నుండి అభివృద్ధి లేకుండా పోయిందని, ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ రాజకీయాలు మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో లేదని, ఆయనకున్న శ్రద్ధ ఒక్కటే కులాల మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం కడుపుకోవటమే, అలాంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అండగా నిలుస్తామని మా మద్దతు తెలియజేస్తామని అన్నారు. అలానే 25 రోజులు పూర్తి అయిన సందర్భంగా రైల్ పేట లో స్థానిక నాయకులు కోటు కిరణ్, గద్దె మహేష్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ వీరాంజనేయులు ముత్యాల సహకారంతో ఒక పేద కుటుంబానికి నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల,రాయని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి నవీన్ పవర్, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 3వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్, 38వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ, మరియు జనసేన నాయకులు బండారు సురేష్, దుర్గ, నరసింహారావు, బాయిరెడ్డి వేణు, ఖాసీం, రాకేష్, నాని, అవినాష్ పర్చూరి, నాగరాజు ఈదుపల్లి, భాను సాయి కుమార్, లింగాతోటి శివ దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.