
కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని Tసుండుపల్లిమండలంలో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తం అవ్వాలని జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాసులు హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల నిన్న బలి అయిన మూగజీవం సంఘటన దృష్టిలో పెట్టుకొని పెద్దబలిజపల్లి గ్రామంలో ఊరికి చుట్టు ప్రక్కన ప్రాంతాల్లో 11KB విద్యుత్ తీగలు చాలా కింద ఉండడంతో ఒక ఎద్దు మృతి చెందింది. 3 ప్రదేశాల్లో ప్రమాదానికి అతి దగ్గర చేరువలో ముంపునకు మూడు చోట్ల ప్రమాదం పొంచి ఉందని అన్నారు. మరో ఘటన జరగకుండా ముందే విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆ పొలాలకు సంబంధించిన రైతులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. అలానే గ్రామంలోని రైతులు మరియు గ్రామస్థులు వారి గోడు విన్నవించుకుంటూ హెచ్చరిక జారీ చేశారు. కావున విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే ఆ ప్రదేశాలను సందర్శించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్కడ ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కారం కావాలని విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికిప్పుడే స్పందించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.