Logo
Date of Publish : 16 January 2021, 3:15 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి : యువ నాయకులు వంగ లక్ష్మణ గౌడ్

                     ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర౦లో జనసేన పార్టీని బలోపేతం చేయాలని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్‌ గౌడ్‌ కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించిమాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడడంతో పాటు సామాన్యులకు అండగా నిలబడుతూ యువతకు సామాన్యులకు రాజకీయాలలో అవకాశం కల్పించడం ద్వారా సమాజంలో సామాజిక మార్పు కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని వివరించారు. పార్టీ వ్యవస్థాపకులు పవన్‌ కళ్యాణ్ ఎంతో ఉన్నత లక్ష్యాలతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. సామాజిక మార్పు సామాజిక సేవ కోసం నూతన జనసేన పార్టీని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన అప్పుడే ప్రజలలో రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేసుకుంటారని వివరించారు. సాధారణ ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేయాలని త్వరలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమాలలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com