నెల్లూరు ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ మెంబర్ నాగబాబు గారి పిలుపుతో ఈ కోవూరు నియోజకవర్గంలోని కొత్త వంగల్లు గ్రామంలో జనసేన మద్దతు దారుడు భక్త వత్సలం, కొంతమంది రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి దాదాపుగా 60 నుంచి 70% మంది జీవిస్తున్నారు జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. పంట రుణాలు, రైతుల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపరిహారం లాటివి ఏమీ వారికి లభించడం లేదన్నారు. నకిలీ విత్తనాలతో గిట్టుబాటు ధర లేమితో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కరెంటు చార్జీలు పెరిగిపోయి నిర్వహణ వ్యయం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేస్తున్న వారిలో దాదాపుగా 90% కౌలుకు చేస్తున్నవారే… వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి ఎకరాకు దాదాపు రూ 30వేలు పై ఖర్చుపెట్టినా దిగుబడి కి సరైన ధర లభించక కౌలుదారుల కష్టాలు చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప మనసుతో సొంత సంపాదన నుంచి దాదాపుగా 650 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నారు. ఈ వైసిపీ ప్రభుత్వం రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అయింది.రైతులు తోలిన ధాన్యానికి సంవత్సరాలు గడిచినా డబ్బులు రాక ఇప్పటికీ ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో మొదటిసారిగా నీరు అందుబాటు లో ఉన్నా కూడా ఒక కాపు వదిలేసి క్రాప్ హాలిడే రైతులు స్వచ్ఛందంగా ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. కొత్త వంగల్లో చూసినట్లయితే రైతు కేంద్రాల్లో 258 అమ్మాల్సిన ఎరువు బస్తాలు బ్లాక్ మార్కెట్లో 350 దాకా అమ్ముతున్నారు. వారానికి వెయ్యి బస్తాల పిండి అవసరం అయితే వచ్చేది 200 బస్తాలే అవి కూడా వైసిపి నాయకులకి అందుతున్నాయి. ఏ అధికారం లేకపోయినా దాదాపుగా 650 కుటుంబాలకు లక్ష రూపాయలు సొంత సంపాదన నుంచి సహాయం చేస్తున్న జనసేన పార్టీ కి అవకాశం ఇస్తే భారతదేశ 5 వ ప్రధానమంత్రి, ‘భారతదేశపు రైతుల విజేత’ గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజైన ఈ జాతీయ రైతు దినోత్సవం ను వేడుకగా జరుపుకునేటట్లు పవన్ కళ్యాణ్ గారు పాటుపడగలరని, గాజు గ్లాసుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనవి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ తో మన్నేపల్లి బక్తవత్సలం, వంశీ, ఉమాదేవి, గౌరీ, సుధాకర్, తదితర జనసైనికులు కంథర్, రాజా ప్రతాప్ హేమంత్, షాజహాన్, ఇంతియాజ్, మౌనిష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.