బొబ్బిలి ( జనస్వరం ) : ముత్తావలస గ్రామం ప్రజలకు త్రాగు నీరు కోసం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బావి ఆధారం. వర్షం నీరు చేరడం మరియు చెత్త చేరడం వల్ల నీరు కలుషితం అయ్యింది. ఈరోజు ముత్తావలస జనసైనికులు ఆధ్వర్యంలో బావిని క్లీన్ చేసి క్లోరినేషన్ చెయ్యడం జరిగింది. ఇందులో జమ్మూ గణేష్, బేవర అప్పలనాయుడు, జమ్మూ భార్గవ్, బొద్దల సతీష్, శ్రీను, సురేష్, సాయి, కిరణ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com