ఎమ్మిగనూరు ( జనస్వరం ) : భగ భగ మంటూ భానుడి ప్రతాపం వేసవి ముందులోనే తీవ్ర ప్రభావం చూపుతుంటే ఒకవైపు బోరు బావుల జలాలు అడుగంటి పోతున్నాయని వాపోయారు. ఎస్ ఎస్ ట్యాంక్ లలో నిల్వ ఉంచిన నీరు అడుగంటి పోతుంటే గొనేగండ్ల గ్రామ ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశం మాత్రం అధికార పార్టీ నాయకులకు లేదని జనసేన పార్టీ ఏమ్మిగనూరు నియోజక వర్గ మీడియా ఇంఛార్జి గానిగ బాషా పేర్కొన్నారు. ఎస్ ఎస్ ట్యాంక్ లో ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నిల్వ ఉంచిన నీటిని కొందరు రాత్రి వేళల్లో జలచౌర్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్ ఎస్ ట్యాంక్ సమీపంలో పొలాల్లో వేసిన పైపులను పరిశీలించి పంటల సాగుకోసం త్రాగునీటిని వాడినట్లు ఆనవాలు గుర్తించినట్లు తెలిపారు. త్రాగునీటి కోసం వేసిన రెండు బోరు బావులు గత ఏడాదిగా నిరుపయోగంగా ఉందని ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తల్లోగ్గి రాత్రి వేళల్లో సాగునీటి కోసం త్రాగునీటినీ ఉపయోగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే జిల్లా అధికారుల దృష్టికి సమస్యను ఆధారాలతో సహా అందించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్రాగునీటి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా త్రాగునీరు పసుపు రంగులో దుర్వాసన కలిగి పంపిణీ చేస్తుంటే నాయకులు మాత్రం ఎన్నికల ముందు విధుల్లో సి సి రొడ్లు వేయిస్తు బిజీగా ఉన్నారని అన్నారు. రోడ్లు అవసరమే కానీ త్రాగునీరు అత్యవసరమని వాటిపైన కొంచెం శ్రద్దపెట్టి వేసవిలో ప్రజలకు సకాలంలో త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటే మీకు ప్రజల తరుపున జనసేన పార్టీ కృతజ్ఞత భావం చూపుతామని లేదంటే మీరు చేసే డైవర్షన్ రాజకీయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని ఇప్పటికైనా త్వరితగతిన శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాలిక్, ఖాసిం, ఇస్మాయిల్, సుభాన్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com