మహబూబ్ నగర్ ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళిత బహుజనులు జనసేన పార్టీ ద్వారా రాజ్యాధికారంలోకి వస్తారనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును అడ్డుపెట్టుకొని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బైరపోగు సాంబశివుడు అన్నారు. నిజానికి రాజకీయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకనే ఇలాంటి ఘటనలకు జనసేన పాల్పడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది. నిజానికి ఈ ఘటనలకు తన కార్యకర్తలతో వైసీపీ పార్టీ పాల్పడుతుందని అన్నారు. దళితులపైన చిత్తశుద్ధి ఉంటే దేశంలోనే ఎక్కువగా ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదైన రాష్ట్రంగా ఎందుకు ఉందని అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు దళితుల మీద దాడులు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com