Logo
Date of Publish : 05 December 2022, 8:09 am
Editor : Sake Naresh

డా. మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరిన యువకులు

              మదనపల్లి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీలోకి భారీ సంఖ్యలో చేరిన యువకులు, జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన డా. మైఫోర్స్ మహేష్. జనసేన పార్టీలో చేరిన 100 మంది విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అభివృద్ధి కోసం వివిధ మదనపల్లి నియోజకవర్గంలో వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ కాలేజీలకు సంబంధించిన యువకులకు జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ డాక్టర్ మైఫోర్స్ మహేష్ జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీ 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు స్థాపించారని అన్నారు. పేద ప్రజల తరఫున పోరాటానికి జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి మనమందరం తోడుగా ఉండాలని ఉద్దేశంతో యువకులందరూ జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అందరూ ఏకతాటిపై నడిచి జనసేన పార్టీ బలోపేతానికై ప్రతి ఒక్కరు కృషిచేసి మదనపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా తెలియజేశారు. అలాగే త్వరలో జనసేన పార్టీ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి అలాగే తన ఆధ్వర్యంలో జనం కోసం జనసేన పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలు విద్యార్థులు పాల్గొని ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న కార్యక్రమంలో అందరూ పాల్గొని మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నాగేంద్ర, హర్ష, సోను, భరద్వాజ్, నరేంద్ర, నికేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com