మంత్రి అంబటి రాంబాబు పై మండిపడ్డ జనసేన నాయకులు Dr.పిల్లా శ్రీధర్

      పిఠాపురం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తీవ్రస్థాయిలో ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి అంబటి రాష్ట్రానికి ఒక కుంపటి అని మంత్రిగా అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖకు చేసింది ఏమీ లేదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తున్నాడని ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొన్న కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బుని చనిపోయిన కౌలు రైతుకి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడానికి సత్తెనపల్లిలో మీటింగ్ పెట్టారు. ఆయన అక్కడ రేపు చూడండి వైసీపీ గాడిదలు మళ్లీ కూస్తాయి అనగానే అంబటి రాంబాబు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అందరికంటే ముందు నేనున్నాను గాడిదలా అన్నట్లు మీడియా ముందుకు వచ్చి కూయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ దేని గురించి మాట్లాడిన అది మాకే వర్తిస్తుంది అన్నట్లు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఊపిరి తీసుకో ప్యాకేజీ తీసుకోకు, మేం గాడిదలం కాదు మీరే గాడిదలు అన్నట్లు చెప్పుకొచ్చారు. వారం రోజులు ఆపి బండి రిజిస్ట్రేషన్ నెంబర్ వదిలారు. ఈ వారం రోజులు మీరు రోడ్డు మీదికి వచ్చి ప్రజల ముందు ఆపాసుపాలయ్యారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ పూర్తి ఆధారాలు పక్కన పెట్టుకుని మాట్లాడరు. రెండున్నర లక్షలు మీరు తీసుకున్నారని ఆయన ఏదో నోటికి వచ్చింది చెప్పేసారనుకొని రోడ్డు ఎక్కేశారు. చేసాను అని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. బాధితురాలు స్వయంగా వచ్చి చెప్పింది రెండున్నర లక్షల మీరు అడిగారని వైస్ చైర్మన్ సాంబశివరావు పేరుతో సహా మొత్తం చెప్పింది ఎక్కడ మీ రాజీనామా అని జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాను అంటూ అంబటి రాంబాబుని ప్రశ్నించారు. అదే విధంగా మీరు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని వచ్చి కావాలనే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. కాపుల్లో పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద మద్దతు ఉందో అంతకన్నా ఎక్కువ మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లో కూడా ఉందని మీడియా పూర్వకంగా మీకు వినిపించుకుంటున్నాను కావాలంటే సర్వే చేసుకోండి ఇప్పటికన్నా పిచ్చిపిచ్చి బురదజల్లే ప్రయత్నాలు మానుకుని ఈ ఆరు నెలలైనా సరే ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటున్నాం అంటూ డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way