తిరుపతి ( జనస్వరం ) : పదవీ విరమణ పొందిన తల్లిదండ్రులను బిడ్డలు ఎంత గౌరవంగా చూసుకుంటారో ప్రభుత్వం కూడా అంతే గౌరవంగా చూసుకోవాలన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం తిరుపతిలో జరిగిన అఖిల భారత పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బోత్ హాస్పిటల్ లో రిటైర్డు ఉద్యోగులకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉండాలన్నారు. మంచి చేస్తే ఎవరినైనా ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుదన్నారు. తన ఆస్పత్రికి వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా తన తల్లిదండ్రులను గౌరవించినట్టు గౌరవిస్తానని తెలిపారు. ఒక డాక్టర్ గా ప్రస్తుతానికి ఈ ఉచిత వైద్య సేవ మాత్రమే చేయగలనని, రాజకీయంగా తనకు అండగా నిలిస్తే అధికారంలోకి వచ్చాక తప్పకుండా రిటైర్డు ఉద్యోగులకు ఏం చేయాలో అప్పుడు చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంగం అధ్యక్షులు శంకర్ గారు, సహా అధ్యక్షులు సురేష్ బాబు వెంకటరమణ, కార్యదర్శి వెంకటేశం శెట్టి, టీడీపీ నాయకులు ఊక విజయ్ కుమార్, అర్కట్ కృష్ణప్రసాద్, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, తిరుపతి ఖజానా అధికారి లక్ష్మీకార్ రెడ్డి, విశ్రాంత ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దివాకర్, జయరామానాయుడు, బాలసుబ్రమణ్యం, సిద్దయ్య జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య గారు, జిల్లా కార్యదర్శి ఆనంద్, నగర కమిటీ నాయకులు పార్ధు, కిరణ్ కుమార్, మనోజ్ కుమార్ గౌస్ బాషా, సీనియర్ నాయకుడు చందు, జనసైనికులు మోహిత్, ఇంద్ర తదితర పెద్దలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com