విశాఖపట్నం ( జనస్వరం ) : స్థానిక 35 వ వార్డులో మృతి చెందిన రామమూర్తి కుటుంబానికి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి ఎటువంటి సమస్య వచ్చిన తాను ముందు ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటానని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆయన పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 35వ వార్డులో పర్యటించి మృతిని కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ పార్టీ నాయకత్వ సమన్వయంతో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో 35 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు లంక త్రినాధ్, జనసేన నాయకులు రఘు,నగేష్,అశోక్, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com