Logo
Date of Publish : 04 September 2023, 9:55 pm
Editor : Sake Naresh

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో డాక్టర్ కందుల సుడిగాలి పర్యటన

   విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం సోమవారం నాటికి 90వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
ప్రతి వార్డుకు నేరుగా వెళ్తున్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు.గడపగడపకు వెళ్లి వారి సమస్యలను నేరుగా వింటున్నారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. అవసరమైతే ప్రజల మంచి కోసం ప్రజల తరుపున పోరాటం చేసేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా జనసేన వైపే ఉన్నారని చెప్పారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా 34 వ వార్డులో లక్ష్మీదేవి పేటకు చెందిన ఎల్లాజీ, కుమారి దంపతుల కుమార్తె నవ వధువు శ్రావనికి బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీలం రాజు, సతీష్, ఎల్లాజీ, ప్రసాద్, దేవా, గౌరీ, రాజు, జానకి, వాణి, కుమారి తో పాటు జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com