• సెవెన్ హిల్స్ లో పిల్లలకు పరామర్శ
• వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖలోని సంగం శరత్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన చిన్నారులను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పరామర్శించారు. వారు చికిత్స పొందుతున్న సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి వెళ్లి పిల్లల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ప్రమాదం జరిగి ఉండకూడదని అభం శుభం తెలియని చిన్నారులు ప్రమాదానికి గురై నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు కూడా తేల్చారని చెప్పారు. వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ సిగ్నల్ పాయింట్ ను దాటాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్లడం కారణం వల్లే ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడం జరిగిందన్నారు. చిన్నారుల వైద్యానికి అయ్యే పూర్తిగా ప్రభుత్వం భరించాలని వారి కుటుంబాలను ఆదుకోవాలని డాక్టర్ కందుల నాగరాజు విజ్ఞప్తి చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com