Logo
Date of Publish : 11 October 2023, 7:55 pm
Editor : Sake Naresh

దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. పవనన్న ప్రజా బాట 93వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన 39 వ వార్డు చిలకపేట పుష్పవతి అయిన అమ్మాయి హేమ కి పట్టు బట్టలు వెండి పట్టీలు అందజేశారు. అలాగే ఆ ప్రాంతంలో పర్యటించి పలువురు దివ్యాంగులను కలుసుకున్నారు. వారికి కావలసిన స్టాండ్లు త్వరలో అందజేస్తానని హామీ ఇచ్చారు. మరి కొద్ది రోజులలో మళ్ళీ ఆ ప్రాంతంలో పర్యటించి దివ్యాంగులకు తప్పకుండా అందజేయునునట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే వ్యక్తిగత సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అన్ని విధాలుగా జనసేన నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రణీత్, గణేష్, నాగేంద్ర,సోమనాయుడు,జయ, లలిత,పద్మ, కుమారి, దక్షిణ నియోజకవర్గ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com