Logo
Date of Publish : 24 October 2023, 7:47 pm
Editor : Sake Naresh

దక్షిణంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 99వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. సహాయం అడిగిన వారికి కాదనకుండా తక్షణమే వారికి సహాయం చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు పెళ్లి కుమారులకు అండగా నిలిచారు. 33 వ వార్డుకు చెందిన పెళ్లి కుమార్తె తిరుమలకు అలాగే 34 వ వార్డుకు చెందిన పెళ్ళికూతురు కృష్ణవేణికి తాళిబొట్లు, పట్టు చీర జాకెట్లు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులైన సరే ప్రజలకు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వాసుపల్లి నరేష్, అజయ్, మణి, మణికంఠ, జయ, వెకటేష్, కోదండమ్మ, శ్రీదేవి, మంగ, అరుణ, దుర్గ, కుమారి, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల బద్రీనాథ్ తోపాటు జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com