విశాఖపట్నం ( జనస్వరం ) : కులమతాలకతీతం ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. స్థానిక 33వ వార్డు కుమ్మరవీధిలో మృతి చెందిన ఎం.డి.నసీమా బేగం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాలకు, కులమతాలకతీతంగా తన సేవలు కొనసాగుతాయని చెప్పారు.ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందుడి వారికి అండగా ఉంటానని తెలిపారు. ఎవరు ఎటువంటి అధైర్య పడనవసరం లేదని మీ సోదరుడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కార సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను కోనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏ. శ్రీనివాసరావు, టమాటా అప్పారావు, కే.రాజేశ్వరి, జయ, టబు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com