Logo
Date of Publish : 19 December 2023, 11:42 pm
Editor : Sake Naresh

మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

    విశాఖపట్నం ( జనస్వరం ) : దక్షిణ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఇప్పటికే నిర్విరామంగా ఎంతో మందికి సేవలు అందజేసినట్లు చెప్పారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడికి తాను వెళ్లడం జరుగుతుందని చెప్పారు. వారి సమస్యను తన సమస్యగా భావించి వారికి ఒక కుటుంబ సభ్యుడిగా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ వారిని ఆదుకోవడం తన కర్తవ్యం గా భావిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం 34వ వార్డు తారకరామ కాలనీలో మృతి చెందిన ప్రకాష్ కుటుంబానికి డాక్టర్ కందుల నాగరాజు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆదేశాల మేరకు నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పార్టీ స్థానిక నాయకత్వం తను చేస్తున్న కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. అర్హులైన పేద వారందరికీ తన సహాయం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని పలు వార్డులలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నట్లు చెప్పారు. వృద్ధులకు, మహిళలకు, చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పుష్పవతి అయిన అమ్మాయిలకు పెళ్లి కుమార్తెలకు పట్టుబట్టలు, బంగారు తాళిబొట్లు, వెండి పట్టీలు అందజేయడం జరిగిందని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం జరిగిందని. అలాగే వికలాంగులకు వీల్ చైర్ లను పంపిణీ చేశామని చెప్పారు. నియోజవర్గంలో తన సేవలు నిర్విరామంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి గురుమూర్తి, లుక్స్ గణేష్, ఎన్.లక్ష్మణ, ప్రసాద్, కృష్ణ, రాజు, భారతి, పతిపాడ చిన్ని, వెంకటేష్, నియోజకవర్గం జనసేన యువనాయకులు కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com