విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 94వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 39 వ వార్డు ఫెర్రీ రోడ్డు లో తల్లిదండ్రులు లేని పెళ్లి కుమార్తె హేమకు బంగారు తాళిబొట్టు, పసుపు కుంకుమ, పట్టుచీర, జాకెట్టు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ జనసేన పార్టీ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందనేది ఆలోచిస్తున్నారని తప్పకుండా వచ్చి ఎన్నికలలో అధికార మార్పు తప్పదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తను చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా చొరవ చూపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రణీత్, జయ, పద్మ, లలిత, అరుణ, కుమారి, రమణి, టి.అప్పారావు, మణి, వెంకటేష్, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, గణేష్, అప్పలరాజు, కాసుబాబు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.