విశాఖపట్నం ( జనస్వరం ) : మహిళాభ్యుదయంతోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. గురువారం ఉదయం అల్లిపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగ రాజు మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోతున్నారని పేర్కొన్నారు. పురుషులతో సమానంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా ముడదగు వేస్తున్నారని చెప్పారు. నేడు ప్రారంభించిన
అల్లిపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతో మంది మహిళలకు ఉపయోగ పడుతుందని చెప్పారు. ఇందులో టైలిరింగ్, బ్యూటిషన్, నేర్పించ బడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు 70 మంది యువతులు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన్ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎల్.మోహన రావు, టైలరింగ్ టీచర్, సిహెచ్ .వనజ, బ్యూటీషియన్ టీచర్ టి.దేవి తో పాటు 70 మంది యువతులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com