Search
Close this search box.
Search
Close this search box.

ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్న డాక్టర్ కందుల నాగరాజు

కందుల నాగరాజు

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 96వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేరుగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకుంటున్నారు. వారికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా నేరుగా వారి కుటుంబ సభ్యులకు సహాయం చేసి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఏనాడు కూడా గర్వానికి పోకుండా సాటి మనిషికి సహాయం చేయాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకుల సమన్వయంతో కలిసి నియోజకవర్గంలో పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా 32 వ వార్డు భీమ్ నగర్ లో ఉన్న పెళ్లి కుమార్తె నీలిమకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర జాకెట్ , పసుపు కుంకుమ అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిహెచ్.శ్రావణి , వి ఏ నాయుడు, మంగ, దుర్గ, కుమారి, పావని, మంజు గౌరీ, మణి, రమణ, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ . వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way