Logo
Date of Publish : 04 December 2023, 10:42 pm
Editor : Sake Naresh

విశాఖ దక్షిణంలో దూసుకెళ్తున్న డాక్టర్ కందుల నాగరాజు

       విశాఖపట్నం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య దిగ్విజయంగా జరుగుతోంది. సోమవారం విశాఖ దక్షిణ నియోజక వర్గంలోని 31, 32 వార్డుల్లో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి పవనన్న ప్రజాబాటలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31వ వార్డు గొల్లలపాలెంలో బొండాల దివ్య మరియు ఆనంద్ ల వివాహానికి హాజరై వధువు దివ్యకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమలను కానుకగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కొల్లూరు రూప, త్రినాథ్, వరలక్ష్మి, నరేంద్ర, తదితరులు హాజరయ్యారు. అనంతరం 32వ వార్డులో పర్యటించారు. ఇక్కడి భీమానగర్లో పినిపిల్లి నాగమణి మరియు గంగాధర్ లవివాహానికి హాజరై వధూవులను ధువు నాగమణి కి బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపుకుంకమలను కానుకగా అందచేశారు. ఈ కార్యక్రమంలో డాల్ఫిన్ శంకర్, రమేష్ పాడి , ఎస్. కోదండమ్మ, కే.దేవి, దుర్గ, కుమారి, పుక్కళ్ళ సతీష్ భద్రి, నూకరాజు, సరస్వతి, సంధ్య, పుష్ప తదితరులు ఫాల్గొన్నారు. 30వ వార్డులో వార్డు బాయ్ కాలనీ లో ఇటీవల పుష్పవతి అయిన జి.గగన కుమారికి పట్టుబట్టలు బహూకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వేలాది మంది పేద వధువులకు బంగారు తాళిబొట్లు, పట్టుచీరలు, పసుపు కుంకుమలను బహుమతిగా ఇస్తున్నా మన్నారు. తాము చేస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి వస్తున్న విశేషస్పందన పట్ల ఆయన ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన యువనయకులు కందుల కేదార్ నాథ్, కందుల బదరీనాథ్ తదితరులు ఫాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com