విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నియోజకవర్గంలో గురువారం ఆటో డ్రైవర్లకు యూనిఫారాలు పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగురాలకు కాలిపర్స్ ( చేతి కర్ర లు ) కూడా అందజేశారు. నియోజకవర్గం మొత్తం ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో టిడిపి- జనసేన కూటమి అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజల భావిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీకి వ్యతిరేకత ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తమ కూటమి మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా జనసేన జెండా ఎగురువేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, గురుమూర్తి, గాజుల శ్రీను, అశోక్ ప్రసాద్, మణి, కుమారి, జానకి, శ్రీదేవి, కోదండమ్మ, అక్కమ్మ అలాగే పలువురు జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com