గుడివాడ ( జనస్వరం ) : పట్టణంలో శ్రీ డొక్కా సీతమ్మ గారి సేవ స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు యువతకు ఆదర్శంగా నిలుస్తున్న గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణకు విశాఖపట్నంలో విశాఖ రత్న కళా పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవారత్న పురస్కార అవార్డును అందజేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గుడివాడ పట్టణంలో అనేక సేవలు చేస్తున్న మా టీమ్ ని గుర్తించి ఈ అవార్డు అందజేయడం జరిగిందని, అదేవిధంగా మన భారత దేశ రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అలాంటి మహానుభావుడు చెప్పిన మాట నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావ్ జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అనే మాటల స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమలు చేస్తున్నామని అలాంటి మహానుభావుడు అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని ఈ అవార్డు రావడానికి కారణమైన మా టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, గంట అంజి, దివిలి సురేష్, చరణ్ తేజ్, నాగసాయి పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com