రైల్వే కోడూరులో జనసేన పార్టీ దళిత నాయకులు నగిరి పాటి మహేష్ డా. బిఆర్ అంబేద్కర్ గారి 130 వ జయంతి సందర్భంగా ఆయనకు పూల మాలని సమర్పించి, జాతిని ఉద్దేశించి మీడియా, పత్రిక పాత్రికేయులతో మాట్లాడుతూ అంబేద్కర్ గారు మట్టిలో మాణిక్యం అని, ఆయన ఈ దేశానికి, బడుగు బలహీనర్గాలకు చేసిన సేవ వేల కట్టలేనిది అని అన్నారు. ఎప్పుడైతే మనం రోడ్డెక్కి హక్కులు కోసం పోరాటం చేస్తామో అక్కడ ఆ దేశ రాజ్యాంగం అమలకు నోచుకోలేదని ఆక్కడ అధికారులు వారి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు అని పనీకి మాలిన పాలకులు అక్కడ పాలిస్తున్నారు అని అర్థం అన్నారు. భారత రాజ్యాంగం ఒక్క దళితులకు మాత్రమే రచించినది కాదు భారత గడ్డ పై జన్మించే ప్రతి పౌరుడు నీ దృష్టి లో పెట్టుకొని అందరి క్షేమం కొరకు రచించ బడినది అని, అంటరాని కుల నిర్మూలనా కోసం తన జీవితం మొత్తం త్యాగం చేశారా అనేది గుర్తుంచు కోవాలి అన్నారు. ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని ఆయన పెట్టిన రాజ్యాంగ బిక్షతో ఈ రోజు ఎమ్మెల్యేలు, మంత్రులగా చలామణి అవుతూ అగ్రకులాలలోని అవినీతి తిమింగలాలు చేతిలో రబ్బరు స్టాంప్ లు గా మిగిలిపోయారు. వ్యక్తిగత ఆపేక్షలు లొంగిపోయి సమిష్టి, సంఘ ప్రయోజనాలను తాకట్టుపెడుతూ అనేక అరాచకాలు, నేరాలకు కేంద్ర బిందువులుగా చీడ పురుగుల వలే సిగ్గు లేకుండా సమాజంలో జీవిస్తున్నారు. అంబేద్కర్ కలలు కన్న అసలైన ప్రజాస్వామ్యం నీ మంటకల్పుతున్నారు. ఆయన ఆత్మ నీ క్షోభ పెడుతున్నారు. మారండి ఇప్పటికైనా లేదంటే మరో స్వతంత్ర పోరాటానికి సిద్దం కావలసి వస్తుంది అని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమం లో మర్రి. రెడ్డి ప్రసాద్, యద్దల అంతరాయాలు, వరికూతి.నాగరాజు, కారుమంచి.సంయుక్త, పవనిజం హేమంత్, ఉత్తరాది.శివ కుమార్, బాలిసెట్టి.వెంకటేష్, డేగల మహేష్, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com