Logo
Date of Publish : 16 July 2026, 7:18 pm
Editor : Sake Naresh

జియాలజీ విభాగంలో డాక్టరేట్ పొందిన డాక్టర్ బండి నారాయణ స్వామి

అనంతపురం, జూలై 6 (జనస్వరం): ప్రముఖ జియాలజిస్టు, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మాజీ అతిథి అధ్యాపకులు డాక్టర్ బండి నారాయణ స్వామికి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్‌వీయూ), తిరుపతి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) డిగ్రీని ప్రదానం చేసింది. "రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అప్లికేషన్స్ ఇన్ ఎవాల్యూషన్ ఆఫ్ డోలమైట్ రిసోర్సెస్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా" అనే అంశంపై ఆయన నిర్వహించిన పరిశోధనకు గాను జియాలజీ విభాగం నుంచి పీహెచ్‌డీ డిగ్రీకి అర్హులని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌వీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి. రాజమాణిక్యం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బండి నారాయణ స్వామి గతంలో అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో దశాబ్ద కాలం పాటు జియాలజీ విభాగంలో అతిథి అధ్యాపకుడిగా సేవలందించారు. ఆయనకు డాక్టరేట్ లభించిన సందర్భంగా స్నేహితులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com