Logo
Date of Publish : 31 March 2026, 8:28 am
Editor : Sake Naresh

గండవరం వడ్డిపాలెంలో జంట హత్యలు కలకలం

- ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గండవరం గ్రామం

- రక్తపు మడుగులో మృతులు కందుర్తి వెంకటేష్, బాల వెంకయ్యగా గుర్తింపు

- ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీసిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు

- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఆధారాలు సేకరించిన క్లూస్ టీం

కొడవలూరు, మార్చి 30 (జనస్వరం) : మండలంలోని గండవరం గ్రామం వడ్డిపాలెంలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతులు దగదర్తి మండలం పెదపుత్తెడు గ్రామానికి చెందిన కందుర్తి వెంకటేష్, సంగం మండలం వెంగారెడ్డిపాలెంకు చెందిన బాల వెంకయ్యగా గుర్తించారు. పొలాల్లోని గడ్డి చుట్టే యంత్రానికి డీజిల్ కోసం ఆదివారం రాత్రి కొడవలూరులోని ఓ పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ తీసుకుని తిరుగు ప్రయాణంలో గండవరం మార్గమధ్యంలోని వడ్డిపాలెంలో రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సోమవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. డీఎస్పీ మాట్లాడుతూ, మృతుడు వెంకటేష్‌కు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు, ఆ మహిళకు చెందిన వ్యక్తి ఇటీవల గ్రామంలో అతడిని అడ్డుకుని బెదిరించినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంపై వెంకటేష్ తండ్రి కూడా మా కుమారుడిని వదిలేయాలని కోరినప్పటికీ, అదే కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో హత్యకు గల అసలు కారణాలు వెలికి తీయడానికి క్లూస్ టీం, పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com