విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విధానాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యం గా ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తున్నామని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమం కరపత్రాలను, టీ షర్ట్స్ ని శుక్రవారం ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను, భావజాలాన్ని, ఆయన త్యాగనిరతిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని వివరించారు. ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ రకమైన పరిపాలన అందిస్తుంది అనే విషయంపై ప్రజలకు వివరిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సంబంధిత అధికారులకు విన్నవిస్తూ ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనపై పవనకల్యాణ్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పడం శుభసంకేతమన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ దుర్మార్గపు పాలన అంతమవుతుందన్నారు. జగన్మోహన్రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఎక్కడ చూసినా అవినీతి తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. చిన్న ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. లోకేష్, పవన్‌కల్యాణ్‌పై వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరుపార్టీల కార్యకర్తలు అదే సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.రామచంద్రరాజు, రౌతు సతీష్, కాటం అశ్వని, మాతా గాయిత్రి, పుష్పకుమారి , పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, ఎల్. రవితేజ, పిడుగు సతీష్ , అడబాల వేంకటేష్ , బాలు, చక్రవర్తి, ఎమ్ .పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, లంకాపట్నం కుమార్, అభిలాష్ , కె.సాయి, సురేష్ కుమార్, హిమంత్ కుమార్, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com