
రామచంద్రాపురం ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ గారి ఆధ్వర్యంలో గంగవరం మండలంలో “ఇంటింటికి జనసేన” అనే కార్యక్రమం చేపట్టారు. కోటిపల్లి గ్రామంలో ‘ఇంటింటికి జనసేన’ కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు గల కరపత్రాలను ప్రజలకు అందజేయడం జరిగింది. కోటిపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ మరియు రోజువారి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చే విధంగా సహకరించవలసిందిగా తెలియజేయడం జరిగింది. గ్రామంలో మహిళలు చంద్రశేఖర్ గారికి సాలువాతో కప్పి సన్మానించడం జరిగింది. రాబోయే కాలంలో కచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు జనసేన నాయకులు, జన సైనికులు ఈ పర్యటనలో తెలియజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, గంగవరం మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, అందరూ భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.