మదనపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం బసినికొండ ఏరియాలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం చేయడం జరిగింది.దాదాపు పెద్ద సంఖ్యలో ప్రతిరోజు వచ్చి శ్రీరామ రామాంజనేయ గారి ఆధ్వర్యంలో ప్రచారమనేది విస్తృతంగా జరుగుతోందని అలాగే ప్రజల్లో స్పందన కూడా చాలా బాగుందని అన్నారు. రామసముద్రం నిమ్మలపల్లి మండలాల్లో కూడా ఉమ్మడి ప్రచారం చేయడానికి పర్యటించాలని అక్కడి జనసేన, టిడిపి నాయకులు వచ్చి రామాంజనేయులు గారిని కోరడం జరిగింది. దీనిబట్టి మనం గమనించాల్సింది ప్రజల్లోనే మార్పు వచ్చింది కనుక ఈసారి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడం ఖాయం అని అన్నారు. అలాగే పల్లె ప్రాంతాల్లో కూడా జనసేన టిడిపి కలిసి ప్రచారం చేయాలని ప్రజలే చెప్పడం దీనికి సంపూర్ణమద్దతు ఇస్తామని చెప్పడం అనేది చాలా గమనించాల్సిన విషయం అన్నారు. ప్రతి వర్గం వారు ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారని తృప్తిగా లేరని ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వం నుండి ఏదో విధంగా నష్టమే జరిగిందని ప్రజలు చెబుతున్నారు. 2024లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం స్థాపించడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రజలందరికీ మంచి పరిపాలన అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత గారు జనసేన నాయకులు ధరణి కుప్పాల శంకర్, జనసేన సోను, సుప్రీం హర్ష, గంగాధర్ , సిద్దయ్య, శ్రీనాథ్, రమేష్, బహదూర్ వీర మహిళలు పద్మావతి సుకన్య, పద్మ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com