మదనపల్లి ( జనస్వరం ) : కురవంక పంచాయతీ సరస్వతి నగర్ లో 26వ రోజున మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన, టిడిపి కలిసి ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జనసేన టిడిపి యొక్క కరపత్రాలను ప్రజలకు చేరవేస్తూ జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం 2024లో వస్తే ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలను తెలియజేయడమైనది. ఈ అరాచాక వైసీపీ ప్రభుత్వ పాలనను గద్దె దింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, జనసేన నాయకులు తులసీ శ్రీనివాసులు, కుప్పాల శంకర, ధరణి, సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి మల్లికా, మహిళలు శాంతమ్మ, పద్మావతి, చందన, నందిని, జ్యోతి, జనసైనికులు వినోద్, రమణ, జగదీష్, ప్రసాద్ రెడ్డి, మోహన్, రాజారెడ్డి, నరేంద్ర, రెడ్డి ప్రసాద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com