
విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆద్వర్యంలో స్థానిక కామక్షినగర్ లో అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న ఎస్సీ, బీసీ కాలనీలో మా నమ్మకం పవన్ – మా భవిత పవన్ అనే స్టిక్కర్లను జనసేన నాయకులు రవితేజ అందించిన గోడ మీద అంటించే చిన్న పోస్టర్లను అంటిచే కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలో ఉన్న ప్రతీ ఇంటికీ తిరుగుతూ పోస్టర్లను అంటించారు. ఈ సందర్భంగా నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ జగన్ పరిపాలనలో మా నమ్మకం నీవే జగన్ అంటూ ఇంటీంటికీ వైసీపి నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నా ప్రజల్లో స్పందన లేదని, ప్రజలంతా పవన్ రావాలి పాలన మారాలి అని ఉత్సాహంగా అంటున్నారని, వైసిపి పాలన పై ప్రజలంతా విసుగు చెందారని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలంతా సంతోషముతో అంటున్నారని.. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు దిక్కని ప్రజలంతా అంటుండం ఎంతో శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రాజు, శ్రీను పాల్గొన్నారు.