శ్రీకాళహస్తి, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఉమ్మడి మినీ మానిఫెస్టోను శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి మండలం, వాగవేడు హరిజనవాడ గ్రామంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి,అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. గ్రామంలో లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువలు శుభ్రం చెయ్యడం లేదు, స్మశానానికి దారి కూడా దారి లేని దయనీయ స్థితిలో ఉన్నామని, నిరుద్యోగ సమస్య ఉందని ప్రజలు ఆవేదన తెలిపారు. సమస్యలన్నీ ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని వినుత ప్రజకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, నాయకులు పేట చిరంజీవి, కవిత, శారద, లక్ష్మి, రాజ్య లక్ష్మి, పేట చంద్ర శేఖర్, రాజేష్, సురేష్, గురవయ్య, జ్యోతి రామ్, హేమంత్, దినేష్, ఉదయ్, వెంకటరమణ, జనసైనికులు దానయ్య, ఉదయ్, చందు యాదవ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com