శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 8 వ రోజు జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారు తొట్టంబేడు మండలం, బసవయ్య పాలెం గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని కోరుతూ, 4.5 సం. లో వైసీపీ చేస్తున్న అరాచకాలను, పథకాల పేరిట వైసీపీ చేస్తున్న దోపిడీని ప్రజలు వివరించడం జరిగింది.. గ్రామంలోని మహిళలు, ప్రజలు కనీసం వీధి రోడ్లు బాగుచెయ్యలేదని, డ్రైనేజ్ కాలువలు అస్సలు లేవని, చిన్నపాటి వర్షానికి వీధుల్లో మోకాలు లోతు నీళ్లు నిలబడ్డాయని తెలిపారు. స్ట్రీట్ లైట్లు లేవని అడిగితే ప్రజలనే డబ్బులు పెట్టీ వేసుకోమన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లో త్రాగు నీరు, డ్రైనేజ్ కాలువలు, రోడ్లు సమస్యలు తప్పక పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి , ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, నాయకులు పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి , చంద్ర శేఖర్, వీర మహిళలు లక్ష్మి , శారద, బతెమ్మ , పుష్ప, గురవయ్య, రాజేష్ , రామ్ , ఉదయ్ , జనసైనికులు చిన్న మునయ్య , మోహన్ , శబరి , రాజేష్ , మదు , శీను , గోపి , హేమంత్ , భాను , తదితరులు పాల్గొన్నారు.