గాజువాక ( జనస్వరం ) : గాజువాక జనసేన పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఎన్నికలకు అందరు సన్నాహకం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు గాజువాక ఇంఛార్జ్ కోన తాతారావు. ఈ ఎన్నికల్లో రాక్షస ఘనాలు ఉన్న జగన్ ని ఎదుర్కోవాల్సి ఉందని, అందుకే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టిడిపి తో సమన్వయం అవుతూ ఎన్నికలకు సంసిద్దం అయ్యారని తెలిపారు. కడప నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, భూ దందాలపై స్వయాన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గతవారంలో వాక్యానించిన విషయం వైసిపి పాలన కు అద్దం పడుతుందని తేలియజేశారు. జగన్ పరిపాలన మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేసారని, డ్వాక్రా రుణాల పేరుతో ఖాతాలో ఉండాల్సిన డబ్బులు మాయమౌతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి పాలన లో పేరుకే 33% రిజర్వేషన్లు తప్ప ఎలాంటి అధికారం వాళ్లకు కల్పించలేదని దుయ్య పట్టారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా జనసేన - టిడిపి ప్రభుత్వం పని చేస్తుందని, అందరు ఎన్నికలకు సంసిద్దం కావాలని కార్యవర్గానికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, ఫైనాన్షియల్ కమిటి మెంబర్ తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు విందుల వెంకటరమణ, గంధం వెంకటరావు, బలిరెడ్డి నాగేశ్వరావు, రౌతు గోవిందరావు, పోల రౌతు వెంకట రమణ, లంకల మురళి దేవి, మాక షాలిని, లంక లత, సంద్రాన భాస్కర్, చోడిపిల్లి ముసలయ్య, కరణం కనకారావు, కాద శ్రీను, మెడిశెట్టి విజయ్, గొలగాని గోపీచంద్, సిరిసపల్లి కనకరాజు, సాడె రామారావు, భార్గవ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com