Logo
Date of Publish : 15 August 2023, 8:02 pm
Editor : Sake Naresh

రక్తదానం చేయడం మనందరి సామాజిక బాధ్యత

           గుంతకల్ ( జనస్వరం ) : మెగా సేవాసుసంపన్నుడు "పద్మభూషణ్" మెగాస్టార్ డాక్టర్ శ్రీ "కొణిదెల చిరంజీవి" గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా గుంతకల్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో పాండు కుమార్, పవర్ శేఖర్ అధ్యక్షతన గోపి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో "మెగా రక్తదాన శిబిరం" జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, రెడ్ డ్రాప్ రెహమాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి రక్తదానం చేయడంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మెగా అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు ఎంతో ఉత్సాహంతో 70 మందికి పైగా రక్తదానం చేసి నవజీవన స్ఫూర్తి దాతలుగా నిలవడం ఎంతో గర్వకారణమని రక్తదాతల సేవ స్ఫూర్తిని కొనియాడారు. రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదని, మానవ శరీరంలో సహజంగా తయారవుతుందని, అందుకే రక్తాన్ని రక్తదానం వల్లనే మరొకరికి అందివ్వగలమని, రక్త దానం చేయడం కొద్ది నిమిషాల పని, ఇది మరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కురుబ పురుషోత్తం కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ రాయల్, కసాపురం వంశీ సీనియర్ నాయకులు పామయ్య, ఆటో రామకృష్ణ, అమర్, అనిల్ కుమార్, సూర్యనారాయణ, చికెన్ మధు, మహేష్, ఐఓసీ శేఖర్, శ్రీనివాసులు, రామకృష్ణ, బర్మశాల శీను, మనోజ్, చంద్ర, వెంకటేష్, శివ, బాబు, మెకానిక్ బాలు, బద్రి, యశ్వంత్, అరవింద్, అల్లు రవి, అల్లు సాయి, శివ కుమార్ హరీష్ మెగా అభిమానులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com