Logo
Date of Publish : 05 April 2022, 5:15 pm
Editor : Sake Naresh

రక్తదానం చేయండి : మానవాళి, మానవత్వాన్ని కాపాడండి : వాసగిరి మణికంఠ

        గుంతకల్ ( జనస్వరం ) : అల్లుఅర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణం గోపి బ్లడ్ బ్యాంక్ సహకారంతో అల్లుఅర్జున్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 81మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు గోపి బ్లడ్ బ్యాంకు అధినేత గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ అల్లుఅర్జున్ అభిమానులు గుంతకల్ పట్టణంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న తీరు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ సృష్టిలో... నా దృష్టిలో... రక్తదాతలు నవజీవన స్ఫూర్తి దాతలు, రక్తదానం చేయండి, చేయించండి మానవాళిని, మానవత్వాన్ని కాపాడండి అని వ్యాఖ్యానించారు. ఈ మెగా రక్తదాన శిబిరం కార్యనిర్వాహకులుగా అల్లుఅర్జున్ ఆర్మీ సభ్యులు అల్లు రవి, వెంకీ, హరీష్, నాసిర్, సాయి, జాను, అల్లు సూరి, మధు, అల్లు చోటు, దినేష్, రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, జనసేన నాయకులు పురుషోత్తం, బండి శేఖర్, పాండు కుమార్, ఎస్.కృష్ణ, రామకృష్ణ, మంజు, వంశి, అనిల్, భాష తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com