Search
Close this search box.
Search
Close this search box.

రక్తదానం చేయండి : మానవాళి, మానవత్వాన్ని కాపాడండి : వాసగిరి మణికంఠ

రక్తదానం

        గుంతకల్ ( జనస్వరం ) : అల్లుఅర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణం గోపి బ్లడ్ బ్యాంక్ సహకారంతో అల్లుఅర్జున్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 81మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు గోపి బ్లడ్ బ్యాంకు అధినేత గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ అల్లుఅర్జున్ అభిమానులు గుంతకల్ పట్టణంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న తీరు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ సృష్టిలో… నా దృష్టిలో… రక్తదాతలు నవజీవన స్ఫూర్తి దాతలు, రక్తదానం చేయండి, చేయించండి మానవాళిని, మానవత్వాన్ని కాపాడండి అని వ్యాఖ్యానించారు. ఈ మెగా రక్తదాన శిబిరం కార్యనిర్వాహకులుగా అల్లుఅర్జున్ ఆర్మీ సభ్యులు అల్లు రవి, వెంకీ, హరీష్, నాసిర్, సాయి, జాను, అల్లు సూరి, మధు, అల్లు చోటు, దినేష్, రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, జనసేన నాయకులు పురుషోత్తం, బండి శేఖర్, పాండు కుమార్, ఎస్.కృష్ణ, రామకృష్ణ, మంజు, వంశి, అనిల్, భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way