ఉరవకొండ, (జనస్వరం) : ఉరవకొండ స్థానిక గవి మఠం నందు జనసేన పార్టీ స్టేట్ ఫోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ p.భవానీ రవికుమార్ గారి సహకారంతో జనసైనికులు మల్లికార్జున & విశ్వనాధ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన శిబిరం 6 వారం దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా అనంత జనసేనాని p.భవానీ రవికుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఉరవకొండ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ, విడపనకల్ మండల అధ్యక్షులు గోపాల్, జిల్లా ఫొగ్రమ్మింగ్ కమిటీ సభ్యుడు అజేయ్, జనసైనికులు సూర్యనాయక్, హరీశంకర్ నాయక్, రవి, తేజ, తిలక్, కుమార్, మారుతీ, వలి, సూరి నారాయణ, మణి కుమార్, సునీల్, విజయ్, హరి, సోము తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com