Logo
Date of Publish : 26 April 2023, 3:58 pm
Editor : Sake Naresh

డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

       గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో డొక్కా సీతమ్మ చదివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవ మాధవసేవ అనే నినాదంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఫుల్ గాస్పెల్ చర్చ్ అధినేత అప్పికట్ల జాషువా గారికి, ముస్లిం మత పెద్దలు ఇమామ్ గారికి, సత్యనారాయణ స్వామి గుడి పూజారి కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. కుల మతాలతీతంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని సమాజానికి దేశానికి పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము కార్యకర్తలుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ సీతయ్య గారు, జనసేన పార్టీ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, గంటా అంజి, చరణ్, నాగ సాయి, సాయి, ఆర్య మాస్టర్, మరియు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com