Logo
Date of Publish : 12 May 2023, 7:11 am
Editor : Sake Naresh

కుక్కల స్వైర విహారం, చర్యలు తీసుకోవాలని డిమాండ్

                కదిరి ( జనస్వరం ) : నిజాం వలి కాలనీలో ఇర్ఫాన్ 7 సంవత్సరాల బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా హాస్పిటల్ నందు వైద్యం తీసుకోవడం జరుగుతోంది. బాలునిపై కుక్కల దాడికి ప్రధాన కారణం అధికార పార్టీ నాయకుల మరియు మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని జనసేన నాయకులు అన్నారు. కదిరి పట్టణంలో ఏ వీధిలో చూసిన ఏ రోడ్డుపై చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల స్థానిక ప్రజలు, పిల్లలు, వృద్దులు బయటకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలునికి మెరుగైన వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని భవిష్యత్తులో ఇటువంటి హృదయవిచారకరమైన సంఘటనలు పునరావృత్తం కాకుండా సత్వరమే కుక్కల బెడద నుంచి కదిరి పట్టణ వాసులకు విముక్తి కలిగించాలని కదిరి జన సేన పార్టీ, కదిరి బీజేపీ పార్టీ తరపున మునిసిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మునిసిపల్ కమీషనర్ గారు స్పందిస్తూ " ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం ఆ బాలునికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఆ బాలుని వైద్యం కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని అదే విధంగా కదిరి పట్టణంలో ఉన్న కుక్కల్ని పట్టడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని రప్పించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, సీనియర్ నాయకులు వానిల్లి అంజిబాబు, 36 వార్డ్ ఇంచార్జీ హరి బాబు, బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు నందిశెట్టి బాబు, తలుపుల గంగాధర్, మైనొద్దిన్, హరి వాల్మీకి, గోవర్ధన్, చలపతి, జనార్ధన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com