అమరావతి, (జనస్వరం) : ఏపీ ప్రభుత్వం పైన మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక అంటూ పత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇచ్చింది. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ జారీ చేసింది. నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక ఇస్తామని అందులో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగానూ వివరించింది. ఈ ప్రకటనలు జారీ పైన జనసేన అధినేత స్పందించారు. వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే..ప్రజల ఇళ్లు- వాకిల్లు, పశునష్టం, పచ్చటి- పొలాల్లో ఇసుక మేట వేసి ఏడుస్తుంటే, ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అని నిలదీసారు. అయితే ప్రభుత్వము ఈ ప్రకటనల్లో బ్లాక్ మార్కెంట్ జరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇంత భారీ ప్రకటనలు ఇవ్వటం పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో పెట్రో ఉత్పత్తుల ధరలు..వ్యాట్ తగ్గింపు అంశంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com