Logo
Date of Publish : 13 July 2021, 6:24 am
Editor : Sake Naresh

సామాన్య ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టావా ? : జనసేన వీర మహిళ కీర్తన

      సామాన్య ప్రజల కష్టాలు ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టావా అంటూ తిరుపతి జనసేన వీర మహిళ కీర్తన గారు ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి అభినందన సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో కీర్తన గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను సేవకులుగా చెప్పి వారికిచ్చేది జీతం కాదు, గౌరవవేతనం అని చెప్పిన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట మార్చి ఉద్యోగాల జాతర పేరిట జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అయితే ఇందులో వాలంటీర్స్ ను కూడా ఉద్యోగాలుగా చూపడం నిరుద్యోగులను వంచించడమే అని అన్నారు. గ్రూప్స్ జాబ్స్ కు కేవలం 36 పోస్ట్స్ ప్రకటించడం బాధ కల్పించిందన్నారు. నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటాయని సగటు సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు కొనాలన్నా భయపడే స్థితికి తీసుకొచ్చారు. సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని, ఇలాగే కొనసాగితే రాష్ట్ర౦ అథో పాతాళానికి వెళ్తుందని అన్నారు. అప్పులు తెస్తే గాని రాష్ట్రాన్ని నడపలేని స్థితి ఏర్పడిందని, వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కనిపిస్తోందని త్వరలోనే ప్రజలు బుద్ది చెప్పే రోజులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com