చిత్తూరు, (జనస్వరం) : గత ప్రభుత్వంలో రేషన్ దుకాణాల ద్వారా కుటుంబ సభ్యులకి ఐదు కిలోల చొప్పున బియ్యం కార్డుకు రెండు కిలోల కందిపప్పు,, అరకిలో చక్కెర, కిలో గోధుమపిండి, కిలో ఉప్పు ఇచ్చేవారు. బియ్యం వద్దు అనుకొనే వారికి బదులుగా చిత్తూరు అనంతపురం జిల్లాలో రాగులు కర్నూలు కడప కృష్ణా జిల్లాల్లో జొన్నలు పంపిణీ చేసేవారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబ సభ్యులకు 5 కిలోల బియ్యం కార్డులకు అరకిలో చక్కెర ఇస్తున్నారు. నెలకు 2 కిలోలు ఇచ్చే కందిపప్పు కిలో చేశారు. కందిపప్పు పై 68% శాతం పంచదార పై 70% శాతం చొప్పున ధరలు పెంచారు. అది కార్డు దారులు అందరికీ ఇవ్వడం లేదు. గోధుమ పిండి, రాగులు, జొన్నలు తీసేశారు. వంటనూనెల ధరలు వాటిని ఆలోచన కొరవడింది కనీసం కూడా ఇవ్వడం లేదని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకుంటామని చెప్పిన వాగ్దానాలు ఇప్పుడు ఏమైనాయని అన్నారు. కచ్చితంగా పెరుగుతున్న ధరలను తగ్గించాలి రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందించి పేదలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com