ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి భవననిర్మాణ రంగానికి చెందిన కార్మికుల దినావస్థలు పెరిగి రోడ్డున పడుతున్నా, ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖగౌడ్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో గురువారం రోజు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ భవననిర్మాణ కార్మికులకు ఇంఛార్జ్ రేఖగౌడ్ చేతులమీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కోలుకోలేని ఇసుక దెబ్బ వేసిందని గుర్తుచేశారు. దేశంలోనే రెండవ అతిపెద్ద నిర్మాణ రంగమైన కార్మికరంగంలో పనిచేసే కార్మికులు కరోనా దెబ్బకు, ఇసుక దెబ్బకు పనులులేక పస్తులు ఉండలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకొనే అనాలోచిత నిర్ణయాల వలన కార్మికరంగాన్ని కష్టాలలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఇసుక అందక పనులు లేక అవస్థలు పడిన కార్మికులకు ప్రస్తుతం అందుతున్న ఇసుక కొనలేక పనులు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ రంగం తరువాత అతిపెద్ద రంగమైన కార్మికరంగాన్ని విస్మరించి నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికావొద్దని హెచ్చరించారు. తక్షణమే ఇసుకను సామాన్యులకు సైతం అందుబాటులో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పెంచిన ఇసుక రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వానికి నిర్మాణరంగం కార్మికులు పడుతున్న కష్టాలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంఛార్జ్ గానిగ బాషా, కరణం రవి, రవిప్రకాష్, షబ్బీర్, వినయ్ మరియు రాహుల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com