విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమాన్ని గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. వరి వ్యవసాయ పొలాలను నీటి సదుపాయం లేక, ప్రభుత్వం రైతులకు కరువు నష్టపరిహారం ప్రకటించక పోవడానికి నిరసనగా కరువుతో బీటా భూములుగా మారిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన జనసేన నాయకులు మర్రాపు సురేష్ గారు మరియు తెలుగుదేశం పార్టీ గజపతినగరం ఇంచార్జ్ కే.ఎ నాయుడు, నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు కలిసి వెళ్లి రైతు గర్జన కార్యక్రమంను నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సాగునీరు అందక వ్యవసాయ పంటలు పూర్తిగా ఎండిపోయి, రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యేకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారికి ఎండిన వరి పొలాలను కనీసం పరిశీలించే తీరికలేకుండా పోయిందా? అని అన్నారు. ఎమ్మెల్యే సామాజిక బస్సు యాత్రపై ఉన్న శ్రద్ద, నియోజకవర్గంలోని సామాన్యులపైనా, రైతుల ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళుంటే కొంచమైనా మేలు జరుగుతుందేమో అని అన్నారు. రైతులకు సాగు నీరును అందించి, కరువు ప్రకటించి, ప్రతీ ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించి, నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు ప్రకటించించి, రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్ మెంబర్ పడాల అరుణ, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, అడ్డడ మోహన్, టీడీపీ మండల నాయకులు భాస్కర్ నాయుడు, బాలాజీ, చాణక్య, చైత్యన,జనసేన మండల నాయకులు అప్పలరాజు,ఏర్ని నాయడు, మహిళలు, రైతులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com