Logo
Date of Publish : 05 November 2023, 10:07 pm
Editor : Sake Naresh

రైతులు కన్నీటి కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?

            విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్  ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమాన్ని గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. వరి వ్యవసాయ పొలాలను నీటి సదుపాయం లేక, ప్రభుత్వం రైతులకు కరువు నష్టపరిహారం ప్రకటించక పోవడానికి నిరసనగా కరువుతో బీటా భూములుగా మారిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన జనసేన నాయకులు మర్రాపు సురేష్ గారు మరియు తెలుగుదేశం పార్టీ గజపతినగరం ఇంచార్జ్ కే.ఎ నాయుడు, నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు కలిసి వెళ్లి రైతు గర్జన కార్యక్రమంను నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సాగునీరు అందక వ్యవసాయ పంటలు పూర్తిగా ఎండిపోయి, రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యేకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారికి ఎండిన వరి పొలాలను కనీసం పరిశీలించే తీరికలేకుండా పోయిందా? అని అన్నారు. ఎమ్మెల్యే సామాజిక బస్సు యాత్రపై ఉన్న శ్రద్ద, నియోజకవర్గంలోని సామాన్యులపైనా, రైతుల ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళుంటే కొంచమైనా మేలు జరుగుతుందేమో అని అన్నారు. రైతులకు సాగు నీరును అందించి, కరువు ప్రకటించి, ప్రతీ ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించి, నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు ప్రకటించించి, రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్ మెంబర్ పడాల అరుణ, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, అడ్డడ మోహన్, టీడీపీ మండల నాయకులు భాస్కర్ నాయుడు, బాలాజీ, చాణక్య, చైత్యన,జనసేన మండల నాయకులు అప్పలరాజు,ఏర్ని నాయడు, మహిళలు, రైతులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com