కళాకారుల ఆవేదన ప్రభుత్వానికి వినిపించదా ? : బొలిశెట్టి సత్యనారాయణ
విశాఖపట్నం జిల్లాలోని 2600 మంది నృత్య కళాకారుల ఆకలి వేదనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యా నారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. నృత్యాన్నే ఆధారంగా చేసుకొని బతుకుతున్న కొందరికి ఈ కరోనా మహమ్మారి వల్ల జీవానాధారం కోల్పోయారు. అన్ని రంగాల వారిని ఆదుకుంటాం అని చెప్పిన ప్రభుత్వం ఈ కళాకారులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఆకలితో అలమటిస్తున్న ఆ కళాకారులు గతంలో మే నెలలో ఎంపీ విజయసాయి రెడ్డి గారిని కలసి తమ వినతిని అందించగా, ఆయన ఇదే విషయమై మే 26న మంత్రి ముత్తంశెట్టి లేఖ రాశారు. ఇది జరిగి మూడు నెలలు అయినా మంత్రి గారి నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణని, ఎంపీలని, ఎమ్మేల్యలని దయ్యబట్టారు. మూడు రాజధానులు కడతాం అని చెబుతున్న ప్రభుత్వం కళాకారుల ఆవేదనను పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. ఇది ఒక జిల్లా సమస్య మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఉందని అన్నారు. ఈ విషయం ఆయా మంత్రికి తెలియకపోవడం, తెలిసినా పట్టించుకోకుండా ఉండడం దారుణం అన్నారు. సదరు ఎంపీ ఇచ్చిన లేఖను పట్టించుకొని మంత్రిగారు ఇదంతా ఒక బూటకపు నాటకం అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని ఆయా కళాకారులకి తగిన సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ వెస్ట్రన్ డాన్సు వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షులు సంతోష్, గౌరవ అధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి ఝాన్సీ, గవర్నింగ్ బాడీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com