అనంతపురం ( జనస్వరం ) : ర్యాలీలు సభలు ప్రదర్శనలు నిర్వహించరాదని జారీ చేసిన చీకటి జీవో కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తుందనేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనంత జిల్లా జనసేన నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం జనసేన పార్టీ శ్రేణులు నగరంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జీవో విన్నపత్రం అందజేసి చేసి మోకాళ్ళతో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు పొదిలి బాబురావు , జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర గార్లు మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న గొంతు నొక్కి చీకటి జీవోను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని మండిపడ్డారు. సీఎం జగన్ తన నిరంకుశ వైఖరితో తెచ్చిన చీకటి జీవో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. బిజెపి సైతం జీవో విడుదలను వ్యతిరేకిస్తుందని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రాన్ని, బావ ప్రకటన ప్రకటన స్వేచ్ఛను, పౌరుల హక్కులను సీఎం జగన్ కాలరాస్తున్నాడని ఏకరువు పెట్టారు. కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12వ తారీకున తలపెట్టిన యువశక్తి భారీ బహిరంగ సభను దృష్టిలో ఉంచుకుని 19/1 జీవోను తీసుకురావడం సీఎం జగన్ దౌర్జన్యానికి పరాకాష్ట అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆప్రజాస్వామిక జీవోను వెంటనే రద్దు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ శ్రీమతి.అనసూయ, జిల్లా కమిటీ సభ్యులు సంజీవ రాయుడు, రాపా ధనుంజయ్, కిరణ్ కుమార్, సిద్దు, పురుషోత్తం రెడ్డి, విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర కమిటీ సభ్యులు జక్కిరెడ్డి ఆదినారాయణ, మేదర వెంకటేష్, దరాజ్ భాష, హుస్సేన్, విశ్వనాధ్, రాజేష్ ఖన్నా, లాల్ స్వామి, సంపత్, నెట్టిగంటి హరీష్, ఆకుల అశోక్, మంగళ కృష్ణ మరియు మండల అధ్యక్షులు తోట ఓబులేసు, ఎర్రిస్వామి కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ మరియు నాయకులు పవనిజం రాజు, శ్రీనివాస్, వడ్డే వెంకటేష్, నజీమ్, హీద్ధూ, హరీష్ (రుద్రంపేట) సాదిక్, మళ్లీ తదితరులు పాల్గొనడం జరిగింది.